దోపిడీ ముఠా హల్‌చల్‌; పోలీసులు చెక్‌ | Vizag Police Arrested 6 Members Of Kidnapping Gang | Sakshi
Sakshi News home page

దోపిడీ ముఠా హల్‌చల్‌; పోలీసులు చెక్‌

Published Thu, Sep 24 2020 8:11 PM | Last Updated on Thu, Sep 24 2020 8:18 PM

Vizag Police Arrested 6 Members Of Kidnapping Gang - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలో ఆరుగురు సభ్యుల దోపిడీ ముఠా ఆగడాలను పోలీసులు అడ్డుకట్ట వేశారు. అర్ధరాత్రి బస్టాప్‌లో నిలిచిన ఇద్దరు యువతులను ఆటోలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. విశాఖ నగరానికి చెందిన మైచర్ల గణేష్, నాగమల్లి ఎల్లాజీ, తాళ్లూరి కుమార్, కొమ్మనాడ పల్లిరాజుతో పాటు మరో ఇద్దరు మైనర్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఒంటరిగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి దోపిడీ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం గాజువాకలో రోడ్డు పక్క ఆగివున్న ఆటో డ్రైవర్‌ను కొట్టి ఆటోను హైజాక్ చేసారు. (పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య)

కూర్మన్నపాలెం వెళ్లే మార్గంలో శనివాడ వద్ద బస్సు దిగి మరో వాహనం కోసం వేచి ఉన్న దేవరపల్లికి చెందిన ఇద్దరు యువతులను బలవంతంగా ఆటో ఎక్కించి,. వారి వద్ద నాలుగు వేల నగదును దోచుకున్నారు. ఆపై ఆటోను ఆపకుండా వెళ్ళిపోతుండగా ఇద్దరు యువకులు ఆటో నుంచి దూకేశారు. ఈ విషయం రాత్రి బీట్ పోలీసులకు తెలియజేయడంతో అర్ధరాత్రి నిందితులను స్టీల్ ప్లాంట్ వద్ద పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆటోను వదిలి పరారయ్యారు. అనంతరం ఈ ఆరుగురిని తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలోనే ఈ రకమైన దారి దోపిడీలకు పాల్పడిన నిందితుల పై నిఘా కూడా కొనసాగిస్తామని క్రైమ్ బ్రాంచ్ డిసిపి సురేష్‌బాబు తెలిపారు. (ప్రియుడి మోజులో భర్త హత్య)

.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement