అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యాలను సమర్పించారనే ఆరోపణలపై అరెస్టయిన తీస్తా సీతల్వాద్, మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం వీరిద్దరి పోలీస్ కస్టడీ ముగియడంతో అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్‌పీ పటేల్ ఎదుట హాజరుపరిచారు.
అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు రిమాండ్ పొడిగించాలని కోరకపోవడంతో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. లాకప్‌డెత్ కేసులో బనస్కాంత్ జిల్లా పలన్‌పూర్ జైలులో జీవిత కాల జైలు శిక్ష అనుభవిస్తున్న శ్రీకుమార్‌ను అహ్మదాబాద్‌కు తీసుకువస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment