setalvad
-
మోదీ సర్కార్‌ను కూల్చేందుకే.. గుజరాత్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ హ్యాండ్!
గుజరాత్ అల్లర్లపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 2002 నాటి అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ఇరికేంచేందుకు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు సిట్ వెల్లడించింది. ఈ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్వా సెతల్వాద్‌కు హ్యాండ్ ఉందని సిట్ పేర్కొంది. ఈ మేరకు సెషన్స్ కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అయితే, 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఆరోపణలపై పోలీసు శాఖకు చెందిన సిట్ దర్యాప్తు జరుపుతోంది. విచారణలో భాగంగా.. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌లకు అహ్మద్ పటేల్ 30 లక్షలు ఇచ్చారని సిట్ తెలిపింది. అలాగే, అల్లర్ల కేసులో మోదీని ఇరికించాలానే ఉద్దేశంతో పటేల్ ఆ డబ్బులు ఇచ్చినట్లు సిట్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. సెతల్వాద్, శ్రీకుమార్‌లు నేర కుట్రకు, ఫోర్జరీకి పాల్పడినట్లు సిట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. జూలై రెండవ తేదీన సెతల్వాద్, శ్రీకుమార్‌లను 14 రోజుల పాటుకు రిమాండ్‌కు తరలిస్తూ అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. గుజరాత్ అల్లర్ల కేసుతో లింకు ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసులో మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్‌ను అహ్మదాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. Shri @Jairam_Ramesh issues statement on the false allegations against Late Sri Ahmed Patel pic.twitter.com/Txder7qojx— Congress Sevadal (@CongressSevadal) July 16, 2022 మరోవైపు.. సిట్ నివేదికను, దివంగత అహ్మాద్ పటేల్‌పై ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మరణించిన వారిని కూడా వదలడం లేదని విరుచుకుపడింది. రాజకీయ పెద్దలు ఆడించినట్లుగా సిట్ ఆడుతోందని, వారు ఏది చెబితే అది చేస్తోందని విమర్శించింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై అహ్మాద్ పటేల్ కుమార్తె స్పందించారు. సిట్ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ కుట్రలో నిజంగా తన తండ్రికి పాత్ర ఉంటే కేంద్రం ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదని ఆమె ప్రశ్నించారు. కాగా అహ్మాద్ పటేల్ 2020లో మరణించిన విషయం తెలిసిందే. Full Reporthttps://t.co/CxYcsB4pRy— Organiser Weekly (@eOrganiser) July 16, 2022 -
తీస్తా, శ్రీకుమార్లకూ రిమాండ్
అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యాలను సమర్పించారనే ఆరోపణలపై అరెస్టయిన తీస్తా సీతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం వీరిద్దరి పోలీస్ కస్టడీ ముగియడంతో అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్పీ పటేల్ ఎదుట హాజరుపరిచారు. అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు రిమాండ్ పొడిగించాలని కోరకపోవడంతో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. లాకప్‌డెత్ కేసులో బనస్కాంత్ జిల్లా పలన్‌పూర్ జైలులో జీవిత కాల జైలు శిక్ష అనుభవిస్తున్న శ్రీకుమార్‌ను అహ్మదాబాద్‌కు తీసుకువస్తామని పోలీసులు తెలిపారు. -
తీస్తా దంపతులను అరెస్టు చేయొద్దు:సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సామాజికకార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ఆనంద్లను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2002 గోద్రా అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలోని మ్యూజియం ఏర్పాటు కోసం సేకరించిన రూ.1.5 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు విచారణలో సెతల్వాద్ దంపతులు సరిగా సహకరించడం లేదని వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సిన అవసరంఉందని తాము భావిస్తున్నామని గుజరాత్ హైకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది. అయితే వారిని ఫిబ్రవరి 19 వరకు అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. గుజరాత్ పోలీసులకు కూడా తాము నివేదికలు అందించే వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. వారిద్దరి ముందస్తు బెయిల్ దరఖాస్తును గుజరాత్ హైకోర్టు కొట్టేసిన కాసేపటికే సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. -
సెతల్వాద్ అరెస్ట్‌పై స్టే
న్యూఢిల్లీ: సామాజికకార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ఆనంద్లను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి ముందస్తు బెయిల్ దరఖాస్తును గుజరాత్ హైకోర్టు కొట్టేసిన కాసేపటికే సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. 2002 అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలోని మ్యూజియం ఏర్పాటు కోసం సేకరించిన నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు విచారణలో సెతల్వాద్ దంపతులు సరిగా సహకరించడం లేదని వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సిన అవసరంఉందని తాము భావిస్తున్నామని గుజరాత్ హైకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అరుణ్ మిశ్రాల సుప్రీంకోర్టు ధర్మాసనం వేరే కేసు విచారణలో ఉండగా.. గుజరాత్ హైకోర్టు ఆదేశాల గురించి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మౌఖికంగా వారికి వివరించారు. సెతల్వాద్ అరెస్ట్‌ను ఆపేందుకు తక్షణమే తమ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని చేసిన విజ్ఞప్తిని అంగీకరించడంతో హుటాహుటిన సెతల్వాద్ దంపతులు సుప్రీంలో చేరుకుని హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు.