సెతల్వాద్ అరెస్ట్‌పై స్టే
న్యూఢిల్లీ: సామాజికకార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్‌ఆనంద్‌లను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి ముందస్తు బెయిల్ దరఖాస్తును గుజరాత్ హైకోర్టు కొట్టేసిన కాసేపటికే సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది.
2002 అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలోని మ్యూజియం ఏర్పాటు కోసం సేకరించిన నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు విచారణలో సెతల్వాద్ దంపతులు సరిగా సహకరించడం లేదని వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సిన అవసరంఉందని తాము భావిస్తున్నామని గుజరాత్ హైకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అరుణ్ మిశ్రాల సుప్రీంకోర్టు ధర్మాసనం వేరే కేసు విచారణలో ఉండగా.. గుజరాత్ హైకోర్టు ఆదేశాల గురించి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మౌఖికంగా వారికి వివరించారు. సెతల్వాద్ అరెస్ట్‌ను ఆపేందుకు తక్షణమే తమ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని చేసిన విజ్ఞప్తిని అంగీకరించడంతో హుటాహుటిన సెతల్వాద్ దంపతులు సుప్రీంలో చేరుకుని హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు.