సామాజికకార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్‌ఆనంద్‌లను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: సామాజికకార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్‌ఆనంద్‌లను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2002 గోద్రా అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలోని మ్యూజియం ఏర్పాటు కోసం సేకరించిన రూ.1.5 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు విచారణలో సెతల్వాద్ దంపతులు సరిగా సహకరించడం లేదని వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సిన అవసరంఉందని తాము భావిస్తున్నామని గుజరాత్ హైకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది.
అయితే వారిని ఫిబ్రవరి 19 వరకు అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. గుజరాత్ పోలీసులకు కూడా తాము నివేదికలు అందించే వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. వారిద్దరి ముందస్తు బెయిల్ దరఖాస్తును గుజరాత్ హైకోర్టు కొట్టేసిన కాసేపటికే సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది.