సాక్షి, తిరుపతి: తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, టీటీడీ ఫారెస్ట్ అధికారులు చిరుతను ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్‌ఓ శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ.. బాలికపై దాడిచేసిన చిరుత ఇదేనా.. కాదా అన్నది పరిశీలిస్తాం. చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్నది తెలుసుకుంటాం. అనంతరం ఫారెస్ట్ అధికారుల నిర్ణయం మేరకు చిరుతను జూలో ఉంచాలా? లేక ఫారెస్ట్‌లో వదలాలా అన్నది నిర్ణయిస్తాం. బోనులో చిక్కిన చిరుత ఆడ చిరుత.. నాలుగేళ్లు ఉంటాయని తెలిపారు.
మరోవైపు.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే నేడు చిరుత పట్టుబడింది. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పే వరకు నిబంధనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.
ఇది కూడా చదవండి: వీడియో: చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది
Comments
Please login to add a commentAdd a comment