
న్యూఢిల్లీ : జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం పెళ్లి. అలాంటి పెళ్లి జీవితాంతం తియ్యని జ్ఞాపకంగా గుర్తుండేలా చాలా మంది రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ పెళ్లిని ఉత్సవంలా, మరికొంత మంది మరుపురాని వేడుకలా జరుపుకున్నారు. కొంత మంది గుర్రాలపై ఊరేగింపుగా రావడం, ఇంకొంత మంది హెలికాప్టర్‌లో పెళ్లిమండపానికి చేరుకోవడం ఇలా భిన్నంగా పెళ్లిళ్లు చేసుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. తాజాగా మరో జంట ఇంకాస్త వెరైటీగా కల్యాణ మండపంలోకి ప్రవేశించారు.
పెళ్లి వేడుక జరిగే ప్రాంతానికి ఓ విద్యుత్ పంజరంలో వారిద్దరూ వచ్చారు. ఆకాశం నుంచి వారిద్దరినీ ఓ డేగ తీసుకువస్తున్నట్లుగా ఓ క్రేన్ సాయంతో వారిని కిందకి దించారు. ఆ సమయంలో పంజరం నుంచి వెలుగులు విరజిమ్మాయి. ఈ దృశ్యాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. వధూవరులు దిగుతున్న సమయంలో ‘బహారో ఫూల్ బర్సావో మేరా మెహబూబ్ ఆయాహై..’అనే క్లాసికల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండడంతో ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment