సాక్షి, తిరుమల: తిరుమలలో బాలికపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనాస్థలంతో పాటు చుట్టుపక్కల బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత బోనులో చిక్కింది.
బాలికపై దాడిచేసిన రెండురోజుల వ్యవధిలోనే చిరుతను అధికారులు పట్టుకున్నారు. బోనులో పడిన చిరుత పెద్దదిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో చిరుతను బంధించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. అనంతరం, చిరుతను అటవీశాఖ అధికారులు జూపార్క్‌కు తరలించారు.
ఈ సందర్బంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే నేడు చిరుత పట్టుబడింది. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పే వరకు నిబంధనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలి. ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
Comments
Please login to add a commentAdd a comment