వీడియో దృశ్యం
న్యూఢిల్లీ : ‘నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు.. బైట కుక్క చేత భంగ పడును’ అన్న పద్యం కచ్చితంగా వినే ఉంటాము. నీళ్లలో ఉన్నప్పుడు మొసలి శక్తి ఏనుగును సైతం చంపేలా ఉంటుందని, బైటి కొచ్చినపుడు కుక్క కూడా దాంతో ఓ ఆట ఆడుకుంటుందని దానర్థం. అయితే కొన్ని కొన్నిసార్లు నీళ్లలో ఉన్నప్పుడు కూడా మొసలి ప్రాణాలకు భరోసా ఉండదు. చిరుత పులి ప్లాన్ వేసి నీళ్లలోకి దూకిందంటే మొసలి ఖతం కాక తప్పదు. ( 1100 కి.మీ. ప్రయాణించిన మొసలి)
సింహాల గుంపుకు సాధ్యంకాని పనిని కూడా చిరుత పులులు ఈజీగా చేసేస్తాయి. చిరుత పులులు మొసళ్లను వేటాడిన పాత వీడియో సమూహం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్ట్ ఫర్ నేచర్ లవర్స్ అనే ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment