అడవి నియమాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ బతకాలంటే బలంతోపాటు వేట సాగించాల్సిందే. జాలి దయ లాంటివి అస్సలు ఉండవు. ఒక జంతువు ఆకలికి మరో ప్రాణి బలి కావాల్సిందే. ఇక సింహం, పులి, చిరుత లాంటి క్రూర మృగాలు వాటికి ఏ జంతువు నచ్చితే వాటిని వేటాడి తమకు ఆహారంగా మార్చేసుకుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో సరిగ్గా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది.
ఓ జాగ్వార్(చిరుతపులి) నదిలోకి దూకి మొసలిని వేటాడి ఆహారంగా మలుచుకుంది. ముందుగా చెట్టు పొదల్లో నక్కిన చిరుతపులి మెల్లగా నది ఒడ్డుకు వచ్చింది. తర్వాత నీటిలో తేలియాడుతున్న మొసలిపై ఒక్క ఉదుటున దూకి భయంకరంగా దాడి చేసింది. వెంటనే దాని దవడలతో మొసలి మెడ భాగంలో కరిచి పట్టుకొని నది నుంచి బయటకు లాక్కెళ్లింది. అయితే చిరుత నుంచి తప్పించుకోవడానికి మొసలి ఎంత పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి పైచేయి జాగ్వార్‌దే అయ్యింది.
ఈ వీడియోను ఫిగెన్ అనే వ్యక్తి తన ట్విటర్‌లో షేర్ చేశాడు. వాస్తవానికి ఈ వీడియోను రెండేళ్ల కిందటే వాహ్సీ హయత్లార్ అనే వ్యక్తి షేర్ చేయగా.. ప్రస్తుతం మరోసారి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. 42 సెకన్ల నిడివిగల ఈ వీడియోను ఇప్పటి వరకు 2.6 మిలియన్ల మంది వీక్షించారు. 27 లైక్‌లు వచ్చాయి.‘ జాగ్వార్ దవడలు చాలా దృడంగా ఉంటాయి. చిరుతపులి చాలా ఆకలిగా ఉన్నట్లు ఉంది. ఓ దేవుడా జాగ్వార్‌కు ఎంత శక్తి ఉంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ..
OMG what a power!! pic.twitter.com/LHZazN2zwP
— Figen (@TheFigen) August 14, 2022
Comments
Please login to add a commentAdd a comment