ఢిల్లీ : కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మార్చి 25 నుంచి అమల్లో ఉన్న లాక్‌డౌన్ మే 17వరకు కొనసాగనుంది. కాగా ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేస్తే ప్రజలు ఏ విధంగా ఉరుకులు పరుగులు పెడతారనేది ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్‌లో ఒక వీడియో ద్వారా చూపించారు.
ఆ వీడియోలో ఒక ముసలి మొదట నీటిలో మెల్లిగా సంచరిస్తూ కదులుతుంది. తర్వతా కొద్దిసేపటికే వెనుక నుంచి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా మొసలి తన ప్రమేయం లేకుండానే వేగంగా వెళ్లి పెద్ద నీటి మడుగులో పడింది. పర్వీన్ ఈ వీడియోను లాక్‌డౌన్ కు లింక్ చేస్తూ ఒక క్యాప్షన్ జత చేశారు.' లాక్‌డౌన్ పూర్తైతే జనం కూడా మొసలి లాగే పరుగులు పెడతారేమో' అంటూ పేర్కొన్నారు. కాగా మొరాకోలోని ఒక జూలో మొసలి సంచరిస్తున్నప్పుడు ఈ వీడియో తీశారు. (వైరల్ : ఇది నిజంగా ఊహించని దాడి)
లాక్‌డౌన్ పుణ్యమా అని ప్రతీ ఒక్క వ్యక్తి సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తున్నాడు. కానీ ఒక్కసారి లాక్‌డౌన్ ఎత్తేస్తే పరిస్థితి నీటిలో ఉన్న మొసలిలానే తయారవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం. పర్వీన్ కశ్వాన్ షేర్ చేసిన ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోనూ 33వేలకు పైగా వీక్షించారు.' పర్వీన్ కశ్వాన్.. లాక్‌డౌన్‌ను ఉద్దేశిస్తూ మీరు లింక్ చేసిన వీడియో చాలా బాగుంది'.. 'లాక్‌డౌన్ పూర్తయ్యాక కూడా మాస్క్‌లు పెట్టుకోండి'..'లాక్‌డౌన్ తర్వాత షాపింగ్ మాల్‌లో మాత్రం పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ' నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్‌పై దేశద్రోహం కేసు)
Comments
Please login to add a commentAdd a comment