
కర్టెసీ: ఈస్ట్‌వెస్ట్
మాస్కో: సర్కస్‌లో ఓ ఆడ సింహం శిక్షకుడిపై దాడి చేసింది. అతడి కాళ్లు, చేతులను కొరుకుతూ ఉగ్రరూపం ప్రదర్శించింది. దీంతో సర్కస్ చూడటానికి వచ్చిన వాళ్లంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన రష్యాలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎంతైనా జంతువులు జంతువులే!
ఆ శివంగి పేరు వేగ. మరో ఆడ సింహం సాంటాతో అప్పటికే కొట్లాటకు దిగిన వేగ.. కోపంతో ఊగిపోతూ శిక్షకుడు మాక్సిం ఓర్లోవ్‌పై దూకింది. అతడు ఎంతగా వారిస్తున్నా వెనక్కి తగ్గలేదు సరికదా.. కాళ్లు, చేతులు కొరుకుతూ చుక్కలు చూపించింది. ఎలాగోలా దాని బారి నుంచి తప్పించుకున్న మాక్సిం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన గురించి అతడు మాట్లాడుతూ... ‘‘ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. నిజానికి వేగ చిన్నప్పటి నుంచే దూకుడుగా ఉండేది. తనకు ఇప్పుడు ఐదేళ్లు. వేగను అదుపు చేయడం కాస్త కష్టమే. ఎంతైనా జంతువులు.. జంతువులే కదా. ఇకపై వేగతో సర్కస్ చేయించబోం. జూ అధికారులతో మాట్లాడి తన స్థానంలో మరో సింహం పిల్లను తీసుకువస్తాం’ అని చెప్పుకొచ్చాడు. కాగా రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment