circus feets
-
వైరల్ వీడియో: రింగ్ మాస్టర్‌కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా!
-
రింగ్ మాస్టర్‌కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా!
వన్యమృగాలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఎన్నో వీడియోల్లో చూసే ఉంటాం. అయితే, జంతువులకు ఎంత ట్రైయినింగ్ ఇచ్చినప్పటికీ పలు సందర్భాల్లో అవి దాడి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే సర్కస్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో రింగ్ మాస్టర్ గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ చోట సర్కస్ జరుగుతోంది. ఇందులో భాగంగా రింగ్ మాస్టర్.. రెండు పులులను స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. పులులతో సర్కస్ ఫీట్ చేస్తుండగా.. ఓ పులి రింగ్ మాస్టర్‌పై దాడి చేసింది. రింగ్ మాస్టర్ కాలిపై దాడి చేసి.. నేలపై లాగుతూ కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఇంతలో పక్కనే ఉన్న మరో వ్యక్తి పులిని నిలువరించే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న టేబుల్ సహాయంతో రింగ్మాస్టర్ను పులి దాడి నుంచి విడిపించాడు. కాగా, పులి దాడిలో రింగ్ మాస్టర్ గాయపడ్డాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Earth Reels (@earth.reel) -
ఒక్కసారిగా మీదకు దూకిన శివంగి.. పరుగులు తీసిన జనం
మాస్కో: సర్కస్‌లో ఓ ఆడ సింహం శిక్షకుడిపై దాడి చేసింది. అతడి కాళ్లు, చేతులను కొరుకుతూ ఉగ్రరూపం ప్రదర్శించింది. దీంతో సర్కస్ చూడటానికి వచ్చిన వాళ్లంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన రష్యాలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతైనా జంతువులు జంతువులే! ఆ శివంగి పేరు వేగ. మరో ఆడ సింహం సాంటాతో అప్పటికే కొట్లాటకు దిగిన వేగ.. కోపంతో ఊగిపోతూ శిక్షకుడు మాక్సిం ఓర్లోవ్పై దూకింది. అతడు ఎంతగా వారిస్తున్నా వెనక్కి తగ్గలేదు సరికదా.. కాళ్లు, చేతులు కొరుకుతూ చుక్కలు చూపించింది. ఎలాగోలా దాని బారి నుంచి తప్పించుకున్న మాక్సిం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి అతడు మాట్లాడుతూ... ‘‘ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. నిజానికి వేగ చిన్నప్పటి నుంచే దూకుడుగా ఉండేది. తనకు ఇప్పుడు ఐదేళ్లు. వేగను అదుపు చేయడం కాస్త కష్టమే. ఎంతైనా జంతువులు.. జంతువులే కదా. ఇకపై వేగతో సర్కస్ చేయించబోం. జూ అధికారులతో మాట్లాడి తన స్థానంలో మరో సింహం పిల్లను తీసుకువస్తాం’ అని చెప్పుకొచ్చాడు. కాగా రెండేళ్ల క్రితం ఉక్రెయిన్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చదవండి: వైరల్: అతడి చర్మాన్ని లాగితే మామూలుగా ఉండదు -
ప్రాణాలకు తెగించి.. పేసర్ బిగించి..
స్టేషన్‌ఘన్‌పూర్: ఈ ఫొటో చూస్తే ఎలాంటి ఆధారం లేని నిచ్చెనను కింద ముగ్గురు పట్టుకోగా.. పైకి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుత్ లైన్‌పై పనిచేస్తుండటం సర్కస్ ఫీట్లా అనిపిస్తోంది కదా! కానీ ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు తమ విధి నిర్వహణలో మామూలేనని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బస్టాండ్ వెనుక వైపు ప్రాంతంలో ఎస్ఎస్ 86 (100 కేవీ) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్లో సోమవారం పేసర్లు బిగించాల్సి వచ్చింది. అయితే, లైన్ వద్దకు వెళ్లి నిలబడి పనిచేసేందుకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో 12 ఫీట్ల నిచ్చెనను నిటారుగా నిలబెట్టి కింద ముగ్గురు సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత కుమార్ అనే విద్యుత్ కార్మికుడు పైకి ఎక్కి పేసర్లు బిగించాడు. -
పాట్లు ఫీట్లు
అన్నప్రసాదం భక్తులకు నరకయాతన బురదలో అడుగేస్తే జారిపడాల్సిందే దుర్గగుడి అధికారులకు పట్టని వైనం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలంటే భక్తులకు సర్కస్ ఫీట్లు తెలిసి ఉండాల్సిందే. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ఆస్పత్రిపాలు కావాల్సిందే. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో అర్జున వీధి అడుగు మేర బురద, మట్టి పేరుకుపోయింది. దీంతో అడుగు తీసి అడుగు వేయ డం కనాకష్టమైంది. తేడా వస్తే జారిపడిపోతున్నారు. ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఘాట్‌రోడ్డు మీదుగానే కొండ కిందకు చేరుకుంటున్నారు.. అయితే అన్న ప్రసాదాన్ని మాత్రం అర్జున వీధిలోని శృంగేరీమఠంలోనే కొనసాగిస్తుండటంతో అక్కడకు వెళ్లాలంటే బురద లో నడిచి వెళ్లాలి. ఓ చంకలో బట్టల బ్యాగు, మరో చంకలో చంటి పిల్లలతో బురదలో నడుచుకుంటూ వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపున బురదలో నడుచుకుంటూ వెళ్లలేక కొంత మంది భక్తులు రోడ్డుకు పక్కనే ఉన్న సిమెంట్ గొట్టాల పైకి ఎక్కి బురదను దాటేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలో కొంత మంది పైపు పై నుంచి జారి పడి బురదలో పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. భక్తుల ఇబ్బందులు కనిపించవా? కనీసం భక్తులు ఇంతగా ఇబ్బంది పడుతున్నా అన్నదాన సిబ్బంది కనీసం భక్తులు నడిచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గమనార్హం. మరోవైపు నిత్యం రద్దీగా కనిపించే అన్నదానం క్యూలైన్లు గురువారం వెలవెలబోయాయి. దేవస్థానం రూ. 40 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నదానం షెడ్డు ఖాళీగానే ఉన్నప్పటికీ శృం గేరీ మఠంలోనే అన్నదానం చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతకు అపచారం... మౌనస్వామిని వదిలేశారిలా ఇంద్రకీలాద్రి: తొలినాళ్లలో దుర్గమ్మ భక్తులకు అన్నదానం చేసిన మౌన స్వామి విగ్రహానికి అపచారం జరిగింది. ఆలయ అధికారులు ఆరు బయట పడేశారు. దీంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉంది. కొండపై మందిరంలో ఉన్న మౌన ముని స్వామి మందిరాన్ని పుష్కరాలకు ముందు దుర్గగుడి అధికారులు కూల్చేయడం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మౌన ముని విగ్రహాన్ని అర్జున వీధిలోని శంగేరీ మఠంలో నిర్వహిస్తున్న అన్నదాన భవనానికి తరలించారు. రంగులు వేసిన తర్వాత ఇలా ఆరు బయట పడేయడం సరికాదని, దీనికి తగిన షెడ్డు ఏర్పాటు చేసి మౌన ముని స్వామి వారి చరిత్ర అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
40 అంతస్థుల భవనంపై సర్కస్ ఫీట్లు
-
సర్కస్ ఫీట్లు కాదు..బతుకు పాట్లు
కొనకనమిట్ల (ప్రకాశం) : నాలుగు రూపాయలు సంపాదించాలంటే సాహసం చేయాలి. యాభై అడుగుల ఎత్తున్న తాటిచెట్లు ఎక్కి తాటాకు కొట్టాలంటే అంతకు మించి ధైర్యం ఉండాలి. కొనకనమిట్ల మండలంలో ఎక్కువగా తాటాకు వ్యాపారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూలీల చేత తాటాకు కొట్టిచ్చి దానిని గుంటూరు, విజయవాడ లాంటి నగరాలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో చినమనగుండం, లింగంగుంట గ్రామాలకు చెందిన వెంకటేశ్వర్లు, బాలయ్యలు ఎంతో ధైర్యంగా చెట్లు ఎక్కి తాటాకు కొడుతున్నారు. ఇక్కడ విశేషమేంటంటే చెట్టు దిగకుండా కర్ర సాయంతో పాకుకుంటూ మరో చెట్టుకు చేరి ఆకు దించుతారు. పొట్టకూటి కోసం ఇలాంటి పనులు చేయక తప్పదని వెంకటేశ్వర్లు, బాలయ్యలు అంటున్నారు.