అగర్తల: మగ, ఆడ సింహాలకు అక్బర్, సీత అని వివాదాస్పద పేర్లు పెట్టిన ఉదంతంలో త్రిపుర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ విషయంలో బాధ్యున్ని చేస్తూ ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్( వైల్డ్‌లైఫ్ అండ ఎకో టూరిజం) ప్రబిన్ లాల్ అగర్వాల్‌ను సోమవారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
సింహాలకు పెట్టిన పేర్లు హిందూ మతస్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఇప్పటికే కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం ఉన్నతాధికారి సస్పెన్షన్ నిర్ణయం తీసుకోడం చర్చనీయాంశమవుతోంది. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి నుంచి తీసుకువచ్చిన రెండు సింహాల్లో మగ సింహానికి అక్బర్ అని, ఆడ సింహానికి సీత అని త్రిపుర సెపాయిజాలా జూ అధికారులు పేర్లు పెట్టారు. ఇది వివాదస్పదం అవడంతో వీహెచ్‌పీ కోర్టుకు వెళ్లింది.
ఇదీ చదవండి.. జ్ఞానవాపి మసీదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment