
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ‘గిర్’ అభయారణ్యంలో మంగళవారం మరో రెండు సింహాలు మృత్యువాతపడ్డాయి. దీంతో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇక్కడ మృతి చెందిన సింహాల సంఖ్య 23కు చేరుకుంది. అంతర్గత పొట్లాటలు, ఇన్ఫెక్షన్ల వంటి కారణాలతో సెప్టెంబర్ 12 నుంచి 19వ తేదీ మధ్య 11 సింహాలు, సెప్టెంబర్ 20 నుంచి 30వ తేదీ మధ్యలో 10 సింహాలు ప్రాణాలు కోల్పోయాయి.
మంగళవారం మరో రెండు చనిపోవడం చాలా దురదృష్టకరమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఢిల్లీ, పూణే నుంచి వచ్చిన నిపుణులు అభయారణ్యంలో ఉంటున్న మిగతా సింహాలను పరీక్షించి ఎటువంటి ప్రమాదం లేదని భరోసా ఇచ్చారన్నారు. మృత్యువాతపడిన సింహాలన్నీ అభయారణ్యంలోని దల్ఖానియా రేంజ్‌లోనివే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment