వీధుల్లో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు
బిలిసి: జార్జియా క్యాపిటల్ నగరం ప్రజలు వణికి పోతున్నారు. అక్కడి జూపార్క్లలోని సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు, మొసళ్లు తప్పించుకొని వీధుల్లో విహరిస్తుండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. గత కొద్ది రోజులుగా అక్కడ విపరీతమైన వరదలు వస్తున్నాయి. ఈ వరదల ప్రభావం జూ పార్క్ లపై కూడా పడి ఆ జంతువులన్నీ తప్పించుకున్నాయి. సింహాలు, పులులు, మొసళ్లు, ఖడ్గ మృగాలు, ఇతర జంతువులు ఇప్పుడు వీధుల్లో దర్శనమిస్తున్నాయి.
దీంతో వీటిని తిరిగి బందించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే వరదల కారణంగా ఆ పట్టణంలో పదిమందికి పైగా ప్రాణాలుకోల్పోవడంతోపాటు పరిస్థితులు అస్తవ్యస్తంగా మారడంతో అధికారులు తీరిక లేకుండా ఉన్నారు. తాజాగా జూ పార్క్ లలో జంతువులు కూడా పారిపోవడంతో అటూ సహాయ చర్యలు చూడలేక, మరోపక్క జంతువులను బందించలేక వారి తల ప్రాణంతోకకొచ్చిన పరిస్థితి ఎదురవుతోందట. ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదల కారణంగా చాలా జంతువులు ప్రాణాలు కోల్పోయాయి.