సింహాల మధ్య బిడ్డకు ప్రసవం | Woman Delivery A Baby In Ambulance In Front Of Lions | Sakshi
Sakshi News home page

సింహ బాలిక

Published Tue, May 26 2020 8:22 AM | Last Updated on Tue, May 26 2020 8:35 AM

Woman Delivery A Baby In Ambulance In Front Of Lions - Sakshi

గాంధీనగర్‌ : అప్పుడే పుట్టిన ఈ పాపకు ‘సింహ బాలిక’ అనే పేరు సందర్భోచితంగా ఉండొచ్చు. గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌లో రహదారిపై చిమ్మ చీకటిలో సింహాల నడుమ బిడ్డను ప్రసవించింది ఓ తల్లి. కంగారు పడకండి. ఆ తల్లి అంబులెన్సులోనే ఉంది. నొప్పులు పడుతుంటే అంబులెన్సు ఆమెను ఇంటì నుంచి ఆసుపత్రికి వెళుతుండగా నాలుగు సింహాలు రోడ్డుకు అడ్డంగా వచ్చి అక్కడే ఉండిపోయాయి. ఇరవై నిముషాల సేపు అవి కదల్లేదు. ఈలోపు అంబులెన్సులోనే ప్రసవం జరిగిపోయింది. తల్లీబిడ్డ క్షేమం. తల్లి పేరు అఫ్సానా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement