లోకో పైలట్‌ సమయస్ఫూర్తి, 10 సింహాలకు తప్పిన ముప్పు Driver Praised For Halting Goods Train, Saving Lives Of 10 Lions On Track. Sakshi
Sakshi News home page

లోకో పైలట్‌ సమయస్ఫూర్తి, 10 సింహాలకు తప్పిన ముప్పు

Published Tue, Jun 18 2024 8:46 AM | Last Updated on Tue, Jun 18 2024 9:55 AM

Driver Praised For Halting Goods Train, Saving Lives Of 10 Lions On Track

గూడ్సు రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి పది సింహాల ప్రాణాలను కాపాడింది.  రైల్వే ట్రాక్‌పై ఉన్నపది సింహాలను చూసిన ఇంజన్ డ్రైవర్  వెంటనే అలర్ట్‌ అయ్యాడు. ఎమర్జెన్సీ బ్రేకులను వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైలు  డ్రైవర్ ముఖేష్ కుమార్ మీనాపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది.

 పిపవవ్ పోర్టు స్టేషన్ నుంచి సైడింగ్ (ప్రధాన కారిడార్‌కు పక్కన చిన్న ట్రాకు)లోకి గూడ్సు రైలును తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సింహాలను చూసిన వెంటనే ముఖేష్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోపాటు, సింహాలు అక్కడినుంచి లేచి వెళ్లిపోయేంత వరకు వేచి చూశారు.

ఈ సంఘటనపై స్పందించిన పశ్చిమ రైల్వే సింహాలు, ఇతర వన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే ట్రాకుపై నడచి వెళ్లే వన్యప్రాణుల పట్ల లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారని తెలిపింది. 

పిపావవ్ పోర్టును ఉత్తర గుజరాత్‌తో కలిపే ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర అటవీ శాఖ  కొన్ని చోట్ల ట్రాక్‌పై కంచెలనుఏర్పాటు చేసింది. అలాగే సింహాలను ఇలాంటి ప్రమాదాలనుంచి కాపాడాలంటూ దాఖలైన పిటీషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం , రైల్వేలను కోరింది. కాగా  2020 జూన్‌ నాటి సర్వే ప్రకారం గుజరాత్ లో 674 సింహాలు ఉన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement