Bhavnagar
-
లోకో పైలట్ సమయస్ఫూర్తి, 10 సింహాలకు తప్పిన ముప్పు
గూడ్సు రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి పది సింహాల ప్రాణాలను కాపాడింది. రైల్వే ట్రాక్‌పై ఉన్నపది సింహాలను చూసిన ఇంజన్ డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ బ్రేకులను వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైలు డ్రైవర్ ముఖేష్ కుమార్ మీనాపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. పిపవవ్ పోర్టు స్టేషన్ నుంచి సైడింగ్ (ప్రధాన కారిడార్‌కు పక్కన చిన్న ట్రాకు)లోకి గూడ్సు రైలును తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సింహాలను చూసిన వెంటనే ముఖేష్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోపాటు, సింహాలు అక్కడినుంచి లేచి వెళ్లిపోయేంత వరకు వేచి చూశారు.ఈ సంఘటనపై స్పందించిన పశ్చిమ రైల్వే సింహాలు, ఇతర వన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే ట్రాకుపై నడచి వెళ్లే వన్యప్రాణుల పట్ల లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారని తెలిపింది. పిపావవ్ పోర్టును ఉత్తర గుజరాత్‌తో కలిపే ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర అటవీ శాఖ కొన్ని చోట్ల ట్రాక్‌పై కంచెలనుఏర్పాటు చేసింది. అలాగే సింహాలను ఇలాంటి ప్రమాదాలనుంచి కాపాడాలంటూ దాఖలైన పిటీషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం , రైల్వేలను కోరింది. కాగా 2020 జూన్ నాటి సర్వే ప్రకారం గుజరాత్ లో 674 సింహాలు ఉన్నాయి. -
పెళ్లిలో కుప్పకూలి వధువు మృతి.. సోదరితో వివాహం
విధి రాతను ఎవరూ మర్చలేరని అంటుంటారు. మనిషి జీవితంలో కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే విధి మరోలా తలుస్తుంది. ఒక్క ఘటన మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే పెళ్లింట విషాదాన్ని నింపింది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు గుండెపోటుతో మరణించింది.. అయినా పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడుకి వధువు కుటుంబం మరో ఆఫర్ ఇవ్వడంతో ముహుర్తం సమాయానికి వివాహం జరిగింది. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన జినాభాయ్ భాకాభాయ్ రాథోడ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, వివాహ వయసు రాగానే తన పెద్ద కూతురుకు హేతల్‌కు నారీ గ్రామానికి చెందిన విశాల్‌తో పెళ్లి ఫిక్స్ చేశారు. కాగా, ముహుర్తం ప్రకారం.. వీరికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. కొన్ని గంటల్లో పెళ్లి అనగా వరుడు విశాల్.. వధువు ఇంటికి ఊరేగింపుగా బయలుదేరాడు. వరుడు విశాల్ ఎంతో ఆనందంలో ఎన్నో ఆశలతో బంధువులతో కలిసి బ్యాండ్ మేళాల మధ్య పెళ్లి వేడుకకు వద్దకు చేరుకున్నాడు. దీంతో, పెళ్లి ఇంట అందరూ ఎంతో ఆనందంగా ఉన్నవేళ.. పెళ్లి కూతురు ఒక్కసారిగా స్పృహ తప్పి కూప్పకూలింది. దీంతో, కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. వధువు అప్పటికే మృతిచెందినట్టు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, వధువుకు గుండెపోటు రావడంతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉన్న సమయంలో వధువు కుటుంబం.. తన కూతురు చనిపోయిన బాధను దిగమింగుకుంది. పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విశాల్‌కు తన కూతురుతో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ నిర్ణయాన్ని వరుడు కుటుంబం కూడా ఒప్పుకుంది. దీంతో, హేతల్ డెడ్‌బాడీని మార్చురీలో భద్రపరిచి.. మరో ముహుర్తం పెట్టించి శుక్రవారం పెళ్లి జరిపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
ప్రధాని మోదీ సమక్షంలో ఒక్కటైన 551 జంటలు
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో 551 జంటలు ఒక్కటయ్యాయి. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. సామూహిక వివాహ వేడుకకు హాజరయ్యారు. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వారికి తన ఆశీస్సులు అందించారు మోదీ. ఈ సందర్భంగా బంధువుల ఒత్తిడితో ప్రత్యేకంగా ఇంటి వద్ద విందు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని నూతన వధూవరులను కోరారు మోదీ. అందుకు ఖర్చు చేసే డబ్బులను తమ పిల్లల కోసం అట్టిపెట్టుకోవాలని సూచించారు. కొత్త జంటలతో కలిసి ఫోటోలు దిగారు మోదీ. వారితో కాసేపు ముచ్చటించారు. భవనగర్ సిటీలోని జవహార్ మైదానంలో ‘పాపా ని పారీ లగ్నోత్సవం 2022’ పేరుతో సామూహిక వివాహాలు జరిపించారు. ఈ మాస్ వెడ్డింగ్ వేడుకల్లో 551 జంటలు ఒక్కటయ్యాయి. తండ్రిని కోల్పోయిన 551 మంది యువతులకు ఈ సామూహిక వివాహ వేదికగా పెళ్లిళ్లు జరిపించారు నిర్వాహకులు. డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వరాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం ఉదయం వల్షాద్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశలో డిసెంబర్ 1న 89, రెండో దశలో డిసెంబర్ 5న 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. Live: PM Shri @narendramodi attends mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, at Bhavnagar, Gujarat https://t.co/c0PJ3oQqM3 — BJP Gujarat (@BJP4Gujarat) November 6, 2022 Gujarat | Prime Minister Narendra Modi attends mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, in Bhavnagar https://t.co/Bwt1tD7FMw pic.twitter.com/4tjrf6Q9iy — ANI (@ANI) November 6, 2022 ఇదీ చదవండి: తగ్గేదేలే! భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్ -
వంతెన పైనుంచి పడ్డ ట్రక్కు
భావ్‌నగర్: పెళ్లి వేడుకలకు వెళ్తున్న ట్రక్కును మృత్యువు వెంటాడింది. అప్పటివరకు పెళ్లి కబుర్లతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భీతావహంగా మారింది. రక్తసిక్తమైన మృతదేహాలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమోగింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు బ్రిడ్జి నుంచి కిందికి పడిపోయింది. దీంతో 30 మందికిపైగా చనిపోయారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నలుగురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నారు. 26 మంది ఘటనా స్థలిలోనే చనిపోయారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా తెలిపారు. ఉదయం 7:30–7:45 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, జిల్లా అధికారులు, స్థానిక గ్రామాల ప్రజలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.‘బోతాడ్ జిల్లాలోని టోటమ్ గ్రామంలో పెళ్లికి హాజరయ్యేందుకు దాదాపు 60 మందితో అనిదా గ్రామం నుంచి ట్రక్కు బయలుదేరింది. భావ్‌నగర్–రాజ్‌కోట్ రహదారిపై రంగోలా వద్ద బ్రిడ్జిపై ముందు వెళ్తున్న వాహనాన్ని దాటబోయి.. అదుపుతప్పి కింద పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’ అని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ ఐఎం సయ్యద్ తెలిపారు. మరోవైపు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. -
గుజరాత్లో ఘోర ప్రమాదం : 20 మంది మృతి
-
గుజరాత్లో ఘోర దుర్ఘటన
భావ్‌నగర్: గుజరాత్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి వంతెన పైనుంచి కాలువలో పడింది. ఈ ఘటనలో 25మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భావ్‌నగర్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి హాజరయ్యేందుకు ట్రక్కులో వెళుతున్న వారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు విడిచారు. ఉదయం సమయం కావడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
వెదురు బొంగులు, ఇనుపరాడ్లతో కొట్టి చంపారు
భావనగర్: గుజరాత్లో కొందరు గ్రామస్తులు దారుణ చర్యకు దిగారు. ఓ మూడేళ్ల చిరుతను నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపారు. అత్యంత పాశవికంగా చేసిన ఈ చర్య కెమెరా కంటికి చిక్కింది. దీంతో వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేసి పోలీసులు విచారణ చేపట్టనున్నారు. భావనగర్ జిల్లా రాజ్ మల్ అనే గ్రామంలోకి శుక్రవారం ఓ చిరుత అడవి నుంచి తప్పిపోయి వచ్చింది. అది కాస్త గ్రామస్తుల కంటపడటంతో వారు ఉచ్చుపన్నారు. అంతేకాకుండా గత కొద్ది కాలంగా తమ పశువులపైన దాడి చేస్తుందని, చిన్నారులను గాయపరుస్తుందని ఆగ్రహించిన గ్రామస్తులు, వెదురు బొంగులు, ఇనుపరాడ్లు, రాళ్లతో కొట్టారు. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని దానిని యానిమల్ కేర్ సెంటర్‌కు తరలించినా తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలుకోల్పోయింది. -
కారు, ట్రక్ ఢీ.. ఐదుగురి మృతి
అహ్మదాబాద్: గుజరాత్ లోని భావ్‌నగర్ జిల్లా రోడ్డు ప్రమాదం సంభవించి ఐదుగురు మృతిచెందారు. శనివారం ఓ ట్రక్ డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఎస్సై ఆర్ ఎన్ జింఝువాడియా తెలిపాడు. భావ్‌నగర్ నుంచి బోటాడ్ పట్టణానికి కారులో తిరిగివస్తుండగా భావ్‌నగర్ - అహ్మదాబాద్ రహదారిపై ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతులు అష్రాఫ్ మన్కడ్ (40), రహిల్ ధందూకియా (25), హుస్సేన్ పాదర్శి (23), సుబాన్ బెన్ మురియా (35), ఫరిదా ధందూకియా (36)లుగా గుర్తించినట్లు ఎస్సై తెలిపాడు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయిందని తెలుస్తోంది. ట్రక్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి, పరారయ్యాడని అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భువనగిరి ఆర్బీనగర్లో బాణసంచా పేలుడు