కారు, ట్రక్ ఢీ.. ఐదుగురి మృతి | Five killed in car-truck collision in Bhavnagar | Sakshi
Sakshi News home page

కారు, ట్రక్ ఢీ.. ఐదుగురి మృతి

Published Sat, Jun 27 2015 4:05 PM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM

Five killed in car-truck collision in Bhavnagar

అహ్మదాబాద్: గుజరాత్ లోని భావ్నగర్ జిల్లా రోడ్డు ప్రమాదం సంభవించి ఐదుగురు మృతిచెందారు. శనివారం ఓ ట్రక్ డ్రైవర్  ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఎస్సై ఆర్ ఎన్ జింఝువాడియా తెలిపాడు. భావ్నగర్ నుంచి బోటాడ్ పట్టణానికి కారులో తిరిగివస్తుండగా భావ్నగర్ - అహ్మదాబాద్ రహదారిపై ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

మృతులు అష్రాఫ్ మన్కడ్ (40), రహిల్ ధందూకియా (25), హుస్సేన్ పాదర్శి (23), సుబాన్ బెన్ మురియా (35), ఫరిదా ధందూకియా (36)లుగా గుర్తించినట్లు ఎస్సై తెలిపాడు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయిందని తెలుస్తోంది. ట్రక్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి,  పరారయ్యాడని అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement