గుజరాత్‌లో ఘోర దుర్ఘటన | Over 20 people dead after a truck fell into a drain | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 6 2018 9:33 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Over 20 people dead after a truck fell into a drain - Sakshi

భావ్‌నగర్‌: గుజరాత్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి వంతెన పైనుంచి కాలువలో పడింది. ఈ ఘటనలో 25మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భావ్‌నగర్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి హాజరయ్యేందుకు ట్రక్కులో వెళుతున్న వారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు విడిచారు. ఉదయం సమయం కావడం, డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement