గాంధీనగర్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై అతివేగంలో ఉన్న కారు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
డీఎస్సీ ఏకే పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమ్మత్‌నగర్‌లోని హైవేపై బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అతివేగంలో ఉన్న ఇన్నోవా కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అహ్మదాబాద్‌కు చెందిన వారిగా గుర్తించినట్టు చెప్పారు.
ఇక, ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారు ముందు భాగంగా పూర్తిగా విరిగిపోయింది. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
#WATCH | Sabarkantha, Gujarat | Himmatnagar Deputy SP, AK Patel says, "Today morning, a car collided with a heavy vehicle on Himmatnagar highway. Seven people travelling in the car are dead, and one person is injured. All of them were residents of Ahmedabad..." https://t.co/bcMBSNrdEg pic.twitter.com/5dBK5SayIG
— ANI (@ANI) September 25, 2024
ఇది కూడా చదవండి: తమిళనాడు: చెట్టును ఢీ కొట్టిన వ్యాన్.. ఆరుగురి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment