ఈ సింహాల అనుబంధం చూశారా? | Lions Picture Become Photo Of The Year In London | Sakshi
Sakshi News home page

ఈ సింహాల అనుబంధం చూశారా?

Published Thu, Feb 14 2019 6:28 AM | Last Updated on Thu, Feb 14 2019 10:03 AM

Lions Picture Become Photo Of The Year In London - Sakshi

భావోద్వేగాలు అన్నవి మనుషులకే పరిమితమా.. ఈ చిత్రాన్ని చూస్తే.. మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.. ఈ రెండు సింహాలు అన్నదమ్ములు.. చూశారుగా.. వీటి మధ్య బాండింగ్‌.. ఇలాంటి చిత్రాలు కాస్త అరుదే.. అందుకే ఇది వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పీపుల్స్‌ చాయిస్‌ పురస్కారాన్ని గెలుచుకుంది. ఏటా ఈ అవార్డును లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్‌ హిస్టరీ మ్యూజియం ప్రదానం చేస్తోంది. మొత్తం 45 వేల ఎంట్రీలు రాగా.. తుది జాబితాకు 25 ఎంపికయ్యాయి. జనం ఓట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని టాంజానియాలో తీశారు. భావోద్వేగాలు అన్నవి మనుషులకే పరిమితం కావన్న విషయాన్ని ఈ ఫొటో నిరూపిస్తోందని.. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఈ చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్‌ న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్‌ లాయిడ్‌ అన్నారు. ఈ చిత్రానికి ఆయన పెట్టిన పేరు ఏమిటో తెలుసా? బాండ్‌ ఆఫ్‌ బ్రదర్స్‌.. పర్‌ఫెక్ట్‌ కదూ..   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement