wild photography
-
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆరాధ్య దేవి 'వైల్డ్' ఫోటోగ్రఫీ.. (ఫొటోలు)
-
కొన్ని క్షణాలపాటే నిల్చుంది.. క్లిక్‌మనిపించాడు!
వెనుక సూర్యుడు ఉదయిస్తుండగా.. ఎముకల కొండపై ఠీవిగా నిల్చుని.. ఏదో తన సామ్రాజ్యాన్నిపర్యవేక్షిస్తున్నట్లుగా.. కొన్ని ఫొటోలు అంతే.. అలా కుదిరిపోతాయంతే.. చూడగానే.. ఫేమస్ హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ నుంచి దిగొచ్చినట్లు లేదూ.. ఈ చిత్రాన్ని దక్షిణాఫ్రికాలోని జీజీ కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ రిజర్వులో సిమోన్‌నీహాం అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఆ సింహం అక్కడ కేవలం కొన్ని క్షణాలపాటే నిల్చుందట.. అంతలో మనోడు క్లిక్‌మనిపించాడు. ‘సింహాన్ని అడవికి రాజు అని ఎందుకంటారో ఈ చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది’ అని సిమోన్ అన్నారు. కేవలం 30 అడుగుల దూరం నుంచే సింహాన్ని తన కేనన్ 1 డీఎక్స్ మార్క్ 2 కెమెరాతో ఫొటో తీసినట్టు వెల్లడించారు. ‘ఈ ఫొటోను చూసినవాళ్లు తమకు తోచిన వ్యాఖ్యానాలు చేశారు. కానీ నాకు మాత్రం.. తన రాజ్యాన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు వచ్చిన మృగరాజులా కనిపించింద’ని 52 ఏళ్ల సిమోన్ పేర్కొన్నారు. -
పాపం.. కక్కలేక మింగేసింది
మింగలేక..కక్కలేక అంటారు కదా.. ఇదిగో ఈ కామరంట్ పక్షిని చూస్తే.. అలాగే అనిపిస్తుంది.. ఈ పక్షులు చేపలు పట్టడంలో స్పెషలిస్టులు.. డుబుక్కున నీటిలో మునిగి.. తాము టార్గెట్ చేసిన చేపను పట్టేసుకుని.. పైకి తేలుతుం టాయి. దీనికి కొంచెం ఆశ ఎక్కువలాగుంది. అందుకే ఏకంగా రెండ్రోజులకు సరిపోయే సైజున్న చేప మీదే కన్నేసింది.. పట్టేయడం పట్టే సింది.. కానీ గొంతులో పట్టాలిగా.. దాంతో ఇలా అవస్థలు పడింది.. మొత్తానికి ఓ 5 నిమి షాల పాటు కిందామీదా పడి.. చేపను గుటుక్కుమనిపించేసిందని ఈ ఫొటోను క్లిక్‌మనిపించిన ఫొటోగ్రాఫర్ రతిక తెలిపారు. -
ఉద్ధవ్ ఠాక్రే... మీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది
ముంబయి : ఈ మధ్యనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అవి ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిభింబిస్తూనే ఆయనలో మరో కోణం ఉందనే అభిప్రాయాన్ని కలిగించేలా ఆ చిత్రాలు ఉండడం విశేషం. ఉదయిస్తున్న సూర్యుడి వెలుగులో పూలతో నిండిన తోట, రణతంబోర్ టైగర్, కెనెడాకు చెందిన పొలార్ ఎలుగుబంటి లాంటివి ఆయన తీసిన వాటిలో ఉన్నాయి. ఈ ఫోటోలకు ' ఐఫోన్ షాట్' అనే క్యాప్షన్ జత చేశారు. View this post on Instagram iPhone shot A post shared by @ uddhavthackeray on Dec 25, 2019 at 10:10pm PST ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో చాలా మందిని ఆకర్షించాయి. అంతేకాదు పోస్ట్ చేసిన ఒక రోజు వ్యవధిలోనే 15 వేలకు పైగా లైక్స్ వచ్చి చేరాయి. ' మీ ఐఫోన్‌తో తీసిన ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఉదయిస్తున్న సూర్యుడి ప్రతిబింబం మీ చిత్రానికి అందాన్నిస్తుంది' అంటూ ఒకరు కామెంట్ చేశారు. ' మీ ఫోటో క్లిక్ బాగుంది. ఫ్రేమ్ సెలక్షన్ ఇంకా బాగుంది' అంటూ పలువురు పేర్కొన్నారు. వైల్డ్‌లైప్ ఫొటోగ్రఫీ తన అభిరుచి అని ఉద్దవ్ ఇదివరకే స్పష్టం చేశారు. View this post on Instagram Gir India A post shared by @ uddhavthackeray on Mar 26, 2017 at 11:55am PDT -
ఈ సింహాల అనుబంధం చూశారా?
భావోద్వేగాలు అన్నవి మనుషులకే పరిమితమా.. ఈ చిత్రాన్ని చూస్తే.. మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.. ఈ రెండు సింహాలు అన్నదమ్ములు.. చూశారుగా.. వీటి మధ్య బాండింగ్.. ఇలాంటి చిత్రాలు కాస్త అరుదే.. అందుకే ఇది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పీపుల్స్ చాయిస్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఏటా ఈ అవార్డును లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రదానం చేస్తోంది. మొత్తం 45 వేల ఎంట్రీలు రాగా.. తుది జాబితాకు 25 ఎంపికయ్యాయి. జనం ఓట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని టాంజానియాలో తీశారు. భావోద్వేగాలు అన్నవి మనుషులకే పరిమితం కావన్న విషయాన్ని ఈ ఫొటో నిరూపిస్తోందని.. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఈ చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్ న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ లాయిడ్ అన్నారు. ఈ చిత్రానికి ఆయన పెట్టిన పేరు ఏమిటో తెలుసా? బాండ్ ఆఫ్ బ్రదర్స్.. పర్ఫెక్ట్ కదూ.. -
వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం: దిగ్విజయ్
-
నాకు వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం: దిగ్విజయ్
హైదరాబాద్:తనకు వైల్డ్ ఫోటో గ్రఫీ అంటే ఇషమని రాష్ర్ట ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆదివారం సాక్షితో మాట్లాడిన దిగ్విజయ్.. వన్య ప్రాణుల సంరక్షణే తన ఫోటోగ్రఫీ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ అడవులను కాపాడగలిగితే వన్యప్రాణులను కాపాడుకోగలమని ఆయన అన్నారు.హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ వెంకట్ ఫోటో గ్రఫీలో తనకు గురువని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మైనారిటీ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏఐసీసీ మైనారీటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్, రాష్ర్ట ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, కార్యదర్శి ఆర్.సి. కుంతియాలు హాజరుకానున్నారు.