
మింగలేక..కక్కలేక అంటారు కదా.. ఇదిగో ఈ కామరంట్ పక్షిని చూస్తే.. అలాగే అనిపిస్తుంది.. ఈ పక్షులు చేపలు పట్టడంలో స్పెషలిస్టులు.. డుబుక్కున నీటిలో మునిగి.. తాము టార్గెట్ చేసిన చేపను పట్టేసుకుని.. పైకి తేలుతుం టాయి. దీనికి కొంచెం ఆశ ఎక్కువలాగుంది. అందుకే ఏకంగా రెండ్రోజులకు సరిపోయే సైజున్న చేప మీదే కన్నేసింది.. పట్టేయడం పట్టే సింది.. కానీ గొంతులో పట్టాలిగా.. దాంతో ఇలా అవస్థలు పడింది.. మొత్తానికి ఓ 5 నిమి షాల పాటు కిందామీదా పడి.. చేపను గుటుక్కుమనిపించేసిందని ఈ ఫొటోను క్లిక్‌మనిపించిన ఫొటోగ్రాఫర్ రతిక తెలిపారు.