ముంబై: లాక్‌డౌన్‌తో జనావాసాలు నిర్మానుష్యంగా మారడంతో జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చిరుతలు తరచుగా జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందిరా నగర్‌లో రోడ్డు మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై ఓ చిరుత అనూహ్యంగా దాడికి దిగింది. ఈ దాడిలో ఇరువురిని తీవ్రంగా గాయపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇటీవల హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో, నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. వీటిని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు.
#WATCH Maharashtra: A leopard was seen attacking a man in Indira Nagar area of Nashik y'day. The leopard has attacked two people here, giving them serious injuries. Forest Officials say, "Its footprints can be traced to forests. Our team is at the spot." (Source: CCTV footage) pic.twitter.com/9MTCCHW73N
— ANI (@ANI) May 30, 2020
Comments
Please login to add a commentAdd a comment