సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యకాండకు దిగారు. నాడు నేడు పనులను అడ్డుకున్న ఆయన.. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సంజీవనగర్ హైస్కూల్ లో నాడు - నేడు పనులకు అధికారులు ఉపక్రమించారు. అయితే.. ఆ ఎదురుగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు ఉంది. కొంతకాలంగా ఆ ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్‌లోనే జేసీ తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు.
అయితే.. అధికారులు హైస్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మిస్తే తన పార్టీ కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతాయని జేసీ అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలు పూడ్చివేయడంతో పాటు అధికారులు, పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు.
దుర్మార్గం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
నాడు నేడు పనుల్ని అడ్డుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలో నాడు -నేడు పనులను జేసీ అడ్డుకోవడం దుర్మార్గం, తాడిపత్రి అభివృద్ధి కి జేసీ అడ్డుపడుతున్నారని మండిపడ్డారాయన.
Comments
Please login to add a commentAdd a comment