
సాక్షి, అనంతపురం: ఎన్నికల వేళ తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చికెన్ వ్యాపారులు తిరుగుబావుట ఎగరవేశారు. జేసీ వేధింపులకు నిరసనగా చికెన్ వ్యాపారులు బంద్ చేపట్టారు. జేసీ వర్గీయులకు నెలనెల రౌడీ మాముళ్లు ఇవ్వలేమని ఆందోళన చేపట్టారు.
చికెన్ వ్యాపారులు నిరసనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అండగా నిలిచారు. తాడిపత్రిలోని చికెన్ వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేయడం దుర్మార్గం అని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేయాల్సిన ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఇలాంటి పనులు చేయటం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో జేసీ కుటుంబ సభ్యులను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment