రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పోలీసులను అరేయ్‌.. ఓరేయ్‌ అంటూ.. | Jc Prabhakar Reddy Shocking Comments On Police And Officers | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పోలీసులను అరేయ్‌.. ఓరేయ్‌ అంటూ..

Published Thu, Aug 17 2023 8:28 PM | Last Updated on Thu, Aug 17 2023 9:18 PM

Jc Prabhakar Reddy Shocking Comments On Police And Officers - Sakshi

సాక్షి, అనంతపురం: తరచూ తన వ్యవహారశైలితో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్‌ అధికారులు, పోలీసులపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అరుపులు, కేకలతో దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అరేయ్‌.. ఓరేయ్‌ అంటూ మీడియా సమావేశంలో ఊగిపోయారు. ఒక్కొక్కరి అంతుచూస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు.

ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్‌లోను ఉనికి కోల్పోయిన  జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు చవకబారు రాజకీయాలు చేస్తున్నారు. గత నెల ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించిన సంగతి తెలిసిందే.

గత ఏడాది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా కలెక్టర్‌పైనే దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. కనీస మర్యాద కూడా లేకుండా కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించడంతో పాటు ఆమె ముందే పేపర్లు విసిరేశారు. అడ్డుకోబోయిన కలెక్టర్‌ గన్‌మెన్‌ను తోసేసి నానా రభస సృష్టించారు.
చదవండి: టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement