జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల న్యూ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు-బైక్ ఢీకొనడంతో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది, ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.