కర్నూలు జిల్లా బనగానపల్లి బస్టాండ్‌లో మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా... చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.
బనగానపల్లి : కర్నూలు జిల్లా బనగానపల్లి బస్టాండ్‌లో మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా... చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పాణ్యం మండలం మద్దూరుకు చెందిన మొహమ్మద్ రసూల్(35) మంగళవారం కుటుంబ సభ్యులతో ఘర్షణ పడి బనగానపల్లి బస్టాండ్‌కు చేరుకున్నాడు.
సాయంత్రం అక్కడే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రసూల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ రసూల్ మృతి చెందాడు.