
ప్రతీకాత్మక చిత్రం
ఆమెను భర్త, మామ కాల్చి చంపారని..
సాక్షి, కర్నూలు: జిల్లాలోని బనగానపల్లె మండలం పండ్లపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పండ్లపురంకు చెందిన వెంకటలక్ష్మమ్మకు పవన్ కుమార్(12), పావని(9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, వెంకటలక్ష్మమ్మ మృతిపట్ల ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్త, మామ కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.