Banganapalle
-
బనగానపల్లె పీఎస్ వద్ద ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసులు
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్‌పై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయించారు. గత బుధవారం అబ్దుల్ ఫైజ్ ఇంటిపై మంత్రి బీసీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అబ్దుల్ ఫైజ్‌కు న్యాయం చేయాల్సిన పోలీసులు ఆయనపైనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పెద్ద ఎత్తున వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు.ఈ నెల 15న అబ్దుల్‌ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా.. ఆ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను భయంభ్రాంతులకు గురి చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్‌ఫైజ్ కథనం మేరకు.. పెద్ద కుమారుడు అబ్దుల్‌ఉబేద్ జోడే కావడంతో బుధవారం విద్యుత్ దీపాలంకరణతో ఇంటిని తీర్చిదిద్దారు. ఈ ఇంటిని హైదరాబాద్ నుంచి వచ్చిన డ్రోన్ కెమెరామెన్స్ చిత్రీకరిస్తున్నారు. అబ్దుల్‌ఫైజ్ ఇంటికి సమీపంలో ఉన్న మంత్రి ఇంటి వద్ద నుంచి కొందరు టీడీపీ అనుచరులు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి.. డ్రోన్ కెమెరాను లాక్కొని కిందపడేసి పగులకొట్టారు.అలాగే ఇంట్లో ఉన్న మహిళలను కూడా భయంభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ప్రవీణ్‌కుమార్ వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన కూడా మంత్రి అనుచరులకు వత్తాసు పలికారు. డ్రోన్ కెమెరామెన్ల పై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
పెళ్లి ఇంట్లో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అనుచరుల వీరంగం
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణంలో వివాహ వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. బనగానపల్లె పట్టణ వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు.పెళ్లి ఇంటికి డ్రోన్ షూట్ చేస్తుండగా మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి ఇంటిని షూట్ చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఓవర్‌యాక్షన్ చేశారు. డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. తెల్లవారితే వివాహం జరగాల్సిన ఇంట్లోవారిని భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారి టీడీపీ పార్టీకి వత్తాసు పలికారు.దీంతో పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.ఇదీ చదవండి: స్కిల్ కేసులో సిట్ క్లోజ్.. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ -
8న వైఎస్సార్ సీపీలోకి చల్లా రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ సీపీలో చేరికపై ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 8వ తేదీన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. ఈ మేరకు చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదు దశాబ్దాలుగా జిల్లాలో మంచి పేరుతో పాటు బనగానపల్లెలో ఓటు బ్యాంక్ కలిగిన చల్లా నిర్ణయంతో జిల్లాలో టీడీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. కాగా చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం విదితమే. అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఫాక్స్ ద్వారా లేఖ పంపారు. చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేసినా, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆయనకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. -
కిరోసిన్ పోసుకుని.. తల్లి, పిల్లల ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: జిల్లాలోని బనగానపల్లె మండలం పండ్లపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పండ్లపురంకు చెందిన వెంకటలక్ష్మమ్మకు పవన్ కుమార్(12), పావని(9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, వెంకటలక్ష్మమ్మ మృతిపట్ల ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్త, మామ కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బస్టాండ్‌లో వ్యక్తి ఆత్మహత్య
బనగానపల్లి : కర్నూలు జిల్లా బనగానపల్లి బస్టాండ్‌లో మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా... చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పాణ్యం మండలం మద్దూరుకు చెందిన మొహమ్మద్ రసూల్(35) మంగళవారం కుటుంబ సభ్యులతో ఘర్షణ పడి బనగానపల్లి బస్టాండ్‌కు చేరుకున్నాడు. సాయంత్రం అక్కడే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రసూల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ రసూల్ మృతి చెందాడు.