
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ సీపీలో చేరికపై ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 8వ తేదీన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. ఈ మేరకు చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదు దశాబ్దాలుగా జిల్లాలో మంచి పేరుతో పాటు బనగానపల్లెలో ఓటు బ్యాంక్ కలిగిన చల్లా నిర్ణయంతో జిల్లాలో టీడీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.
కాగా చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం విదితమే. అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఫాక్స్ ద్వారా లేఖ పంపారు. చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేసినా, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆయనకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment