
పేరుకే మహా నగరం. తీరు చూస్తే మహా నరకం అన్నట్టుంది ప్రయాణికుల పరిస్థితి. ఒకవైపు ఎండలు మండుతుంటే కనీసం నిలువ నీడ లేకుండాపోయింది

సిటీలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు

మార్చిలోనే భానుడు భగ్గుమంటున్నాడు. నగరంలో చాలా ప్రాంతాల్లో బస్సు షెల్టర్‌లు లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఎండుతున్నారు

మధ్యాహ్నం పూట నెత్తి మీద సూరీడు.. నేలమీద వేడి సెగలతో తల్లడిల్లుతున్నారు. బస్సు షెల్టర్ వసతి కల్పించాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నారు

రానున్న రెండు నెలల్లో ఎండలు మరింత ముదిరే ప్రమాదం పొంచి ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు

గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రయాణికుల అవస్థలకు అద్దం పట్టిన దృశ్యాలివి (సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు)

















