
అసౌకర్యాలకు కేరాఫ్..బస్టాప్
త్వరలో పునరుద్ధరిస్తాం
తుఫాన్ ధాటికి దెబ్బతిన బస్‌షెల్టర్లలో 90 అందుబాటులోకి తెచ్చాం. మిగతావి త్వరలోనే బాగుచేస్తాం. బస్టాండుల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సిబ్బందికి సూచనలిస్తున్నాం. ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా చూడటానికే ప్రయత్నిస్తున్నాం.
-వై.జగదీష్‌బాబు, ప్రాంతీయాధికారి
బస్టాపుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అసౌకర్యాలకు నిలయంగా ఉండే ఇవి హుద్‌హుద్ దెబ్బకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పైకప్పుల్లేని ప్లాట్‌ఫారాలు, శిథిలమైన బెంచీలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. గ్రామీణ ..సిటీ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి రోజూ 1013 బస్సుల్లో 6.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖలో 420 బస్‌షెలర్లలో తుఫాన్‌కు 260 దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బస్సులను నడుపుతున్న ఆర్టీసీ అధికారులు పాడై న వీటిని పట్టించుకోవడం లేదు.షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్లపైనే నిలబడుతున్నారు. విశాఖలో జాతీయ రహదారి వెంబడి షెల్టర్లు కనుమరుగయ్యాయి. బస్టాపుల దుస్థితిపై ‘సాక్షి’ ఫోకస్
అసౌకర్యాలకు కేరాఫ్..బస్టాప్
* సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో బస్టాప్‌ల పరిస్థితి దయనీయంగా ఉంది. హుద్‌హుద్ ధాటితో మరింత అధ్వానంగా తయారయ్యాయి.
* అనకాపల్లి బస్‌స్టాండ్‌లో ఫ్యాన్లు, మైక్ అనౌస్‌మెంట్ పనిచేయడం లేదు. 10 గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు.
* అరకు వేలీ బస్‌స్టాండ్‌లో తాగునీరు కరువైంది. అరకువేలీ నుంచి లోతేరు వరకూ 90 గ్రామాలకు బస్ సౌకర్యమే లేదు.
* చోడవరం నియోజకవర్గంలో 150 గ్రామాలకు బస్సులు నడవడం లేదు. బస్టాండ్‌లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. 106 సర్వీసుల్లో ఇప్పుడు 86కు కుదించారు.
* నర్శీపట్నం అడ్డురోడ్డు నుంచి ఒకే ఒక్క బస్సు తిరుగుతోంది. జల్లూరు వద్ద బ్రి డ్జి దెబ్బతిన్నదంటూ చూపిస్తున్నారు.
* పాడేరులో సయమానికి బస్సులు రావడం లేదు.
* చింతపల్లి కాంప్లెక్సులో తాగునీరు, మరుగుదొడ్లు లేవు. ఎనిమిది పంచాయతీల్లో గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు.
* నక్కపల్లిలో మెయిన్‌రోడ్డుపై బస్టాండ్ ఉన్నా ఎక్స్‌ప్రెస్‌లు రావడంలేదు. పా యకరావుపేటలోనూ ఇదే పరిస్థితి.
* సబ్బవరం బస్టాండ్ భయానకంగా మారింది.
* పెందుర్తిలో రూ.10లక్షలతో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది.
* భీమిలిలో 30ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్ లోకి ప్రయాణీకులు వెళ్లడం లేదు. యలమంచిలి బస్టాండ్‌కి పక్కనే 16వ నెంబర్ జాతీయ రహదారి ఉండటంతో ఎక్స్‌ప్రెస్‌లు బస్టాండ్‌లోకి రాకుండా వెళ్లిపోతున్నాయి.