బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
Published Fri, Mar 17 2017 11:50 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఆర్టీసీబస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్‌ఫాం వద్ద ఆగాల్సిన బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement