బస్టాండ్‌లో యువతికి తాళి కట్టిన యువకుడు | Inter Students Marry In Chennai Bus Stand Video Goes Viral | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో యువతికి తాళి కట్టిన యువకుడు

Published Thu, Mar 16 2023 1:44 AM | Last Updated on Thu, Mar 16 2023 11:15 AM

Inter Students Marry In Chennai Bus Stand Video Goes Viral - Sakshi

వేలూరు: బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న యువతి మెడలో యువకుడు తాళి కట్టిన సంఘటన ఆంబూరులో సంచలనం రేపింది. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు బస్టాండ్‌లో మంగళవారం సాయంత్రం సుమారు 8 గంటలకు బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉన్నారు. రాత్రి సమయం కావడంతో దుకాణదారులు దుకాణాలను మూసే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో పంజాబ్‌ దస్తులు వేసుకున్న యువతితో యువకుడు కలిసి వచ్చారు.

కొద్ది సమయంలో ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఒక ప్రైవేటు బస్సు వెనుకకు వెళ్లారు. యువకుడు జేబులో ఉన్న తాళి బొట్టును తీసి యువతి మెడలో కట్టాడు. ఆ యువతి కూడా తాళిని సర్వ సాధారణంగా దుస్తులు లోపల వేసుకుని అక్కడి నుంచి ఇద్దరూ కలిసి వెళ్లారు. గమనించిన కొందరు ప్రయాణికులు కలికాలం అనుకుంటూ మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా బస్టాండ్‌లో జరిగిన ఈ తంతు వీడియో కొందరు ఫేస్‌బుక్‌లో పెట్టారు. విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు యువతీ, యువకుల కోసం బస్టాండ్‌లో గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకి తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement