విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు
Published Thu, Aug 11 2016 12:26 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
విద్యారణ్యపురి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ వలీఉల్లాఖాద్రీ విమర్శించారు. హన్మకొండలోని ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాÄæూకరణ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం విద్యావ్యవస్థను కార్పొరేట్æకబంధ హస్తాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎన్.అశోక్‌స్టాలిన్, నాయకులు పొలెపాక వెంకన్న, ప్రవీణ్, గడ్డం నాగన్న, మహేందర్, ల్యాదల్లశరత్, శ్రవణ్, జన్నె అశోక్, చింత జగదీశ్, బిక్షపతి, వీరన్న, హరీష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement