being
-
అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తాం
కోటబొమ్మాళి: రాష్ట్రంలోని 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూములు పేదలకు చెందేలా... జిరాయితీ భూముల మాదిరిగానే పేదలు అన్ని హక్కులు పొందేలా ఆర్డినెన్స్ తెస్తామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రేగులపాడులో రూ.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను శుక్రవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అనుకున్న పనిని ఎలాగైనా సాధించగలిగే ధీరుడు సీఎం వైఎస్ జగన్ అని, ఎలాంటి వాగ్దానాన్ని అయినా ఆయన అమలు చేయగలరని ప్రశంసించారు. అమరావతిలో ఒకేసారి 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరుచేసి సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు నివేశన స్థలాలు, ఇళ్లు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట... అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు అండ్‌కో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని పార్టీలు ఏకమైనా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే మళ్లీ సీఎం అవుతారని ధర్మాన స్పష్టంచేశారు. సచివాలయ వ్యవస్థతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమూల మార్పులు తెచ్చామన్నారు. కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. -
ప్రతిపక్షాల భేటీ: బీజేపీకి పోటీగా మహాకూటమి పేరు ఇదే..!
బెంగళూరు: 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా రెండో రోజు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష కూటమికి ఓ కొత్త పేరును సూచించారు. అయితే.. కూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేసినట్లు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల డిన్నర్ మీటింగ్ నిన్న బెంగళూరులో జరిగింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు. ఇదీ చదవండి: కులతత్వ విషం, అపారమైన అవినీతి.. వాళ్ల దుకాణాల్లో దొరికేవి ఇవే: విపక్షాలపై మోదీ ఫైర్ -
ట్విన్ సిస్టర్స్‌ను మింగేసిన కారు
గుర్గావ్: హృదయాన్ని కలచి వేసే దుర్ఘటన ఇది. ముద్దులొలికే కవల పిల్లలు బలైపోయారు. అప్పటిదాకా అమ్మమ్మ తాతాయ్యలతో వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన అక్కాచెల్లెళ్లు(5) కానరాని తీరాలకు చేరడం ఆ కుటుంబంలో అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. గుర్గావ్ లో బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. మీరట్‌లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్న గోవింద్ కవల పిల్లలు హర్ష , హర్షిత వేసవి సెలవుల్లో పటౌడీ, జమల్ పూర్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడున్న చిన్నకుక్క పిల్లలతో ఆడుకోవడం అలవాటైంది. ఈ క్రమంలో సమీపంలో పార్క్ చేసిన ఉన్న కారులోకి ఎలా వెళ్లారో తెలియదుగానీ...అనుకోకుండా కార్ డోర్స లాక్ అయిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు అలా కారులోనే ఉండిపోయారు. ఇంతలో పిల్లలు కనిపించడకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెదుకులాట ప్రారంభించారు. చివరికి సాయంత్రం 6.15గం.లకు ఇంటిముందు పార్క్‌చేసినున్న కారు ముందు సీటులో ఒకరు, వెనుక సీటులో అపస్మారక స్థితిలో పడి వుండగా గమనించారు. దీంతో కారు తలుపులు పగుల గొట్టి చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగింది. సుమారు 4.45 ని.లకు పిల్లలకు లెమన్ డ్రింక్ ఇచ్చినట్టు తాత కన్వర్ సింగ్ చెప్పారు. బుధవారం వీరు మీరట్ వెళ్లాల్సి ఉందనీ, ఇంతలోనే తమ బిడ్డలు ఇక ఎప్పటికీ లేకుండా పోయారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే గోవింద్ కజిన్‌కు చెందిన ఈ కారు గత కొన్ని నెలలుగా వాడడంలేదని తెలుస్తోంది. కారు తలుపులు, విండోస్ లాక్ అవడం వల్లనే పాపలు చనిపోయినట్టు బిలాస్పూర్ పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ మహేష్ కుమార్ ధృవీకరించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు. -
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు
విద్యారణ్యపురి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ వలీఉల్లాఖాద్రీ విమర్శించారు. హన్మకొండలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాÄæూకరణ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం విద్యావ్యవస్థను కార్పొరేట్æకబంధ హస్తాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎన్.అశోక్‌స్టాలిన్, నాయకులు పొలెపాక వెంకన్న, ప్రవీణ్, గడ్డం నాగన్న, మహేందర్, ల్యాదల్లశరత్, శ్రవణ్, జన్నె అశోక్, చింత జగదీశ్, బిక్షపతి, వీరన్న, హరీష్ పాల్గొన్నారు. -
మేక్ ఇన్ ఇండియా నినాదానికి బ్రేక్