బెంగళూరు: 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా రెండో రోజు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష కూటమికి ఓ కొత్త పేరును సూచించారు. అయితే.. కూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేసినట్లు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం.
ప్రతిపక్ష పార్టీల డిన్నర్ మీటింగ్ నిన్న బెంగళూరులో జరిగింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు.
ఇదీ చదవండి: కులతత్వ విషం, అపారమైన అవినీతి.. వాళ్ల దుకాణాల్లో దొరికేవి ఇవే: విపక్షాలపై మోదీ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment