consider
-
ప్రతిపక్షాల భేటీ: బీజేపీకి పోటీగా మహాకూటమి పేరు ఇదే..!
బెంగళూరు: 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా రెండో రోజు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిపక్ష కూటమికి ఓ కొత్త పేరును సూచించారు. అయితే.. కూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్డిఐఏ)పేరును ఖరారు చేసినట్లు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల డిన్నర్ మీటింగ్ నిన్న బెంగళూరులో జరిగింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు. ఇదీ చదవండి: కులతత్వ విషం, అపారమైన అవినీతి.. వాళ్ల దుకాణాల్లో దొరికేవి ఇవే: విపక్షాలపై మోదీ ఫైర్ -
పచౌరీపై చార్జిషీట్
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగిని లైంగికంగా వేంధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ వేత్త ఆర్ కే పచౌరీపై ఢిల్లీ పోలీసులు వేయనున్న చార్జిషీట్ ను ఢిల్లీలోని న్యాయస్థానం నేడు పరిగణలోకి తీసుకోనుంది. 23 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఎస్ఎంఎస్ టెక్ట్స్, వాట్సప్ సందేశాలను ఈ చార్జిషీట్ లో పోలీసులు పొందుపరిచారు. ది ఎనర్జీ రిసోర్స్ ఇనిస్టిట్యూట్(టెరి) లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలో సహచర మహిళా ఉద్యోగిని వేధించాడని పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కింద పనిచేసే రీసెర్చ్ స్కాలర్ పచౌరీ తనను లైంగికంగా వేదించాడనే కారణంతో ఆమె టెరీకి రాజీనామా చేసింది. అనంతరం ఆమెను వేరొక సంస్థకు బదిలీ చేశారు. తీవ్ర విమర్శల అనంతరం పచౌరీ సెలవులపై వెళ్లారు. -
వాజ్పేయికి భారతరత్న అవార్డు?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న'కు బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. వాజ్పేయి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 25న వాజ్పేయి జన్మదినం సందర్భంగా వాజ్పేయికి ఈ అవార్డు ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.