పచౌరీపై చార్జిషీట్
Published Sat, May 14 2016 1:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగిని లైంగికంగా వేంధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ వేత్త ఆర్ కే పచౌరీపై ఢిల్లీ పోలీసులు వేయనున్న చార్జిషీట్ ను ఢిల్లీలోని న్యాయస్థానం నేడు పరిగణలోకి తీసుకోనుంది. 23 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఎస్ఎంఎస్ టెక్ట్స్, వాట్సప్ సందేశాలను ఈ చార్జిషీట్ లో పోలీసులు పొందుపరిచారు.
ది ఎనర్జీ రిసోర్స్ ఇనిస్టిట్యూట్(టెరి) లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలో సహచర మహిళా ఉద్యోగిని వేధించాడని పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కింద పనిచేసే రీసెర్చ్ స్కాలర్ పచౌరీ తనను లైంగికంగా వేదించాడనే కారణంతో ఆమె టెరీకి రాజీనామా చేసింది. అనంతరం ఆమెను వేరొక సంస్థకు బదిలీ చేశారు. తీవ్ర విమర్శల అనంతరం పచౌరీ సెలవులపై వెళ్లారు.
Advertisement