విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కాంతిలాల్ దండే హెచ్చరించారు. బుధవారం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విజయనగరం డివిజన్‌లోని ఎంపీడీఓలు, తహశీల్దార్లతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 7,566 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూ రు కాగా, ఇప్పటికి కేవలం 1668 నిర్మాణలే ప్రారంభించడంపై అసహనం వ్యక్తంచేశారు. మిగిలిన వాటిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి చేయా లని ఆదేశించారు. మండలస్థాయిలో ప్రతి ఒక్క అధికారి ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. స్థలాలు లేని గ్రామాల్లో పంచాయతీ స్థలాలను గుర్తించి, ఒకే బ్లాకులో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలన్నారు.
అవసరమైతే ఎన్‌ఆర్‌జీఎస్ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి లబ్ధిదారులకు వారి వారి ప్రాంతాల్లోనే ఇటుకలు తయారు చేయడానికి చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ ఎస్. అప్పలనాయుడును ఆదేశించారు. మెంటాడ మండలానికి మంజూరైన 222 వ్యక్తిగత మరుగుదొడ్లకు గాను 219 ప్రారంభించడంతో కలెక్టర్ అక్కడి ఉద్యోగులను ప్రత్యే కంగా అభినందించారు. ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. అలాగే వచ్చేనెల 3వ తేదీ నుంచి గ్రామ సందర్శన కార్యక్రమాన్ని పునఃప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎన్ మోహనరావు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మెహర్‌ప్రసాద్, డీఆర్‌డిఏ పీడీ జ్యోతి, ఆర్‌డీఓ జె. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
Published Thu, Dec 12 2013 3:48 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement