
ఈ రోడ్లింతే.. విశ్వనగరం ఓ తంతే..!
ఫిల్‌గూడలో కుంగిన రహదారి
గొరుు్యలో పడ్డ వాహనాలు
ముగ్గురికి తీవ్ర గాయాలు
మల్కాజిగిరి : విశ్వనగరమంటారు.. అద్దంలా మెరిపిస్తామంటారు.. గుంతలు పడ్డ రోడ్లనే సరిచేయలేని నాయకులు అద్భుతంగా మార్చేస్తామంటారు.. ఇది కాదన్నట్టు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా తవ్వేస్తారు.. పనులు చేయకుండా కాలయాపన చేస్తుంటారు.. ఇదేంటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిస్తారు. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారులు కుంగిపోరుు ప్రాణాలు పోయే పరిస్థితి తలేత్తినా పనులు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తుంటారు. మొన్న ఎన్‌టీఆర్ గార్డెన్ ముందు రోడ్డు కుంగిపోరుు ప్రమాదకరంగా మారిన విషయం మరువకముందే.. మల్కాజిగిరి సర్కిల్ రోడ్డు కుంగిపోరుుంది. దీన్ని సరిచేయక పోవడంతో వాహనదారులు అందులో పడిపోరుు ప్రాణాలు పోయేంత పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే..
అక్కడ ఏం జరుగుతోంది..!
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మంచినీటి సరఫరా పనులను ఏడాది క్రితం ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో మెట్రో వాటర్ బోర్డు ప్రాజెక్ట్ విభాగం పర్యవేక్షణలో ఐహెచ్‌పీ కంపెనీ పైపులైన్ల ఏర్పాటు, రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టింది. డిఫెన్‌స కాలనీ నుంచి మల్కాజిగిరి వరకు ప్రధాన పైపులైన్ల ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నారుు. ఈ పనుల తీరుపై ప్రజా ప్రతినిధులే అసంతప్తి వ్యక్తం చేశారు. రోడ్లను తవ్వి వదిలిపెట్టడంతో తలెత్తిన ఇబ్బందులపై విపక్షాలు సైతం ధర్నాలు చేశారుు.
ప్రమాదం జరిగిందిలా..
సఫిల్‌గూడ ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో పైపులైన్ వేయడానికి రోడ్డును తవ్వినప్పుడు భూమిలో వివిధ పైపులు, బండరారుు అడ్డం వచ్చారుు. అదే ప్రాంతంలో చాణుక్యపురి రిజర్వాయర్ నుంచి కాలనీలకు మంచినీరు సరఫరా అయ్యే సబ్‌లైన్ కూడా ఉంది. పైపులైన్ ఏర్పాటుకు ఇబ్బందులు రావడంతో తవ్విన గొరుు్యని నిర్లక్ష్యంగా మట్టితో పూడ్చి వదిలేవారు. ఇదిలావుండగా.. శనివారం ఉదయం సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్‌కు వాకింగ్‌కు కోసం ఆనంద్‌బాగ్‌కు చెందిన ఏసురత్నం వెళుతున్నారు. కృపా కాంప్లెక్స్‌కు చెందిన ఆంజనేయులు అతని వదినను తీసుకొని బైక్ మీద మల్కాజిగిరికి వస్తున్నారు. వీరిద్దరు ఒక్కసారిగా పైపులైన్ తవ్విన ప్రదేశం మీదుగా వెళుతుండగా ఆ ప్రాంతం కుంగిపోరుు ఆ గుంతలో వారు వాహనాలతో సహాపడిపోయారు. వెంటనే స్ధానికులు అప్రమత్తమై వారిని బయటకు తీశారు. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు. వీరి వాహనాలు గొరుు్యలో పడేముందే ఆర్టీసీ బస్సు వెళ్లిందని, ఆసమయంలో గనుక గొరుు్య పడివుంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.