మానవత్వానికి మచ్చ..!
వర్షంలోనే రోగిని వదిలేసిన గాంధీ సిబ్బంది
హైదరాబాద్: ప్రభుత్వ అంబులెన్‌సలో తీసుకొచ్చిన ఓ రోగిని వార్డులో చేర్చకుండా ఆస్పత్రి బయటే వర్షంలో వదిలేశారు. వర్షంలో తడుస్తూ సదరు రోగి చేస్తున్న హాహాకారాలను అక్కడే ఉన్న కొంతమంది పట్టించుకోకుండా మానవత్వానికే మచ్చతెచ్చారు. నిన్నటికి నిన్న సీటీ స్కాన్ పనిచేయడం లేదని నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం.. నేడు వర్షంలో రోగిని వదిలేసిన ఈ హృదయవిదారక సంఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. అస్వస్థతకు గురైన రోగి నరసయ్య కొద్దిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మంజూరైన డబ్బు వైద్యానికి ఖర్చు అరుుపోరుుంది.
దీంతో సీఎం సహాయనిధి కోసం ప్రయత్నించమని తోటివారు సలహా ఇవ్వడంతో అతని భార్య గాంధీ ఆస్పత్రిలోని ఉచిత అంబులెన్‌సలో నరసయ్యను గురువారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకువె ళ్లింది. తిరిగి అదే అంబులెన్‌సలో మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం రోగిని అంబులెన్‌స నుంచి స్ట్రెచర్‌పైకి దించారు. అంతలోనే వర్షం పెరగడంతో స్ట్రెచర్‌పై రోగిని అలాగే వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రధాన భవనం వద్ద స్ట్రెచర్‌ను తీసుకువెళ్లేందుకు ర్యాంపు లేకపోవడంతో రోగి భార్య దిక్కుతోచని స్థితిలో ఉండిపోరుుంది. సహాయం చేయమని కోరినా వర్షంలో తడిసిపోతామని అక్కడ ఉన్నవారు నిరాకరించారు. ఐదు నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న ఓ వ్యక్తి వర్షంలో తడుస్తున్న రోగిని చూసి వార్డులోకి చేర్చేందుకు సహాయపడ్డాడు.