కొణిజర్ల: ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో ఈరోజు(ఆదివారం) పర్యటిస్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. రైతుల సమస్యలు అడిగి ఆమె మాట్లాడుతున్న క్రమంలో అస్వస్థతకు గురయ్యారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలనకు షర్మిల వెళ్లగా అక్కడ సొమ్ముసిల్లి కింద కూర్చుండిపోయారు. పంట నష్టంపై మాట్లాడుతుండగా షర్మిల అస్వస్థతకు గురయ్యారు.
అంతకుముందు రైతుల సమస్యలపై మీడియాతో మాట్లాడిన షర్మిల.. కేసీఆర్ సర్కారును నిలదీశారు. ‘ ఇటీవల కురిసిన వర్షానికి ఖమ్మం రైతులు దారుణంగా నష్టపోయారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన మొక్క జొన్న పంట నేల పాలయ్యింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గత నెల ఇదే ఖమ్మం జిల్లాకి కేసీఅర్ వచ్చాడు. మొక్క జొన్న పంటను పరిశీలించి 10 వేలు ఇస్తా అని ప్రకటన చేశాడు. గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పాడు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు.
పెద్ద పెద్ద భవంతులు కట్టేందుకు డబ్బులు ఉంటాయి.పంట నష్టపోయిన రైతులకు ఇవ్వడానికి రూపాయి కూడా ఉండదు. 2.50 లక్షల ఎకరాలు అని చెప్పి ఇప్పుడు లక్షా 50 వేల ఎకరాలు అన్నారు..అది కూడా లేదు. బొడి 5 వేలు రైతు బందు ఎవడు అడిగాడు.30 నుంచి 50 వేలు పెట్టుబడి పడితే నష్టపోయారు.5 వేలు ఏ మూలకు సరిపోతాయి.’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment