నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి తీవ్ర అస్వస్థత | Nandyal MP SP Y. Reddy sickness about bp | Sakshi
Sakshi News home page

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి తీవ్ర అస్వస్థత

Published Thu, Mar 24 2016 3:21 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి తీవ్ర అస్వస్థత

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి తీవ్ర అస్వస్థత

అధిక రక్తపోటుతో ఫిట్స్... హైదరాబాద్ కేర్‌కు తరలింపు
నంద్యాల: నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి రక్తపోటు అధికం కావడంతో ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ముందుగా స్థానిక సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొంత కాలంగా అస్వస్థతకు లోనైన ఆయన.. ఇటీవల కోలుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని గడివేముల మండలం ఉండుట్ల గ్రామంలో 30 ఏళ్ల తర్వాత బుధవారం జరిగిన జాతరలోనూ పాల్గొన్నారు.

అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే ఎండ తీవ్రతతో రక్తపోటు అధికమై అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు న్యూరాలజిస్ట్ వరదరాజు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ హరినాథరెడ్డి వెళ్లి ఆయనకు వైద్యం చేశారు. ఇదే సమయంలో ఫిట్స్ వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత ఆయన అల్లుడు శ్రీధర్‌రెడ్డి, కుమార్తెలు సుజల, రాణి, మేనల్లుడు రాజగోపాల్‌రెడ్డి హుటాహుటిన అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement