పంది మాంసం తిన్న ఎఫెక్ట్‌.. కాళ్లలో మొత్తం పరాన్నజీవులే | Legs Sickness After Eating Pork In America | Sakshi
Sakshi News home page

పంది మాంసం తిన్న ఎఫెక్ట్‌.. కాళ్లలో మొత్తం పరాన్నజీవులే

Published Sun, Sep 1 2024 10:13 AM | Last Updated on Sun, Sep 1 2024 10:13 AM

Legs Sickness After Eating Pork In America

ఉడకని పంది మాంసం తిన్న ఫలితం

అమెరికాలో భయానక పరిస్థితిని ఎదుర్కొన్న రోగి

సీటీస్కాన్‌తో వెలుగులోకి అసలు విషయం

వాషింగ్టన్‌: కాళ్ల నుంచి నడుము దాకా నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన రోగికి సిటీ స్కాన్‌ చేసి ఆ రిపోర్ట్‌ చూశాక అవాక్కవడం వైద్యుల వంతైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా హెల్త్‌ జాక్సన్‌విల్లే వైద్యకళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు అంశాలపై ప్రజలకు ఆన్‌లైన్‌లో అవగాహన కల్పించే ఒక వైద్యుడి ద్వారా ఈ విషయం వెల్లడైంది. రోగికి తీసిన సీటీ స్కాన్‌ రిపోర్ట్‌లను చూపిస్తూ పరాన్న జీవులతో ఇబ్బందిపడ్డ ఆ రోగి వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా డాక్టర్‌ శామ్‌ ఘలీ వెల్లడించారు.

డాక్టర్‌ శామ్‌ ఘలీ చెప్పిన వివరాల ప్రకారం..అత్యవసర చికిత్స నిమిత్తం ఆగస్ట్‌ 25వ తేదీన ఆ రోగిని మా ఎమర్జెన్సీ రూమ్‌లో చేర్పించారు. వెంటనే నేను సీటీ స్కాన్‌ తీ యించా. ఆ సీటీ స్కాన్‌ రిపోర్ట్‌చూశాక నాకు నోట మా టరాలేదు. కాళ్లలో ఎక్కడపడితే అక్కడ పరాన్నజీవులు తిష్టవేశాయి. సరిగా ఉడకని పంది మాంసం తినడం వల్ల రోగి శరీరంలోకి పంది నులిపురుగులు ప్రవేశించి రెండు కాళ్ల కండరాలను మొత్తం ఆక్రమించేశాయి. ఈ విషమ పరిస్థితిని టేనియా సోలియం లేదా సిస్టీసెర్కోసిస్‌గా వ్యవహరిస్తారు.

ఏమిటీ సిస్టీసెర్కోసిస్‌?
సరిగా ఉడకని, పచ్చి పంది మాసం తినడం వల్ల ఆ మాంసంలోని నులిపురుగులు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దాని లార్వాలు మెదడు, కండరాల్లో కి చొరబడితే ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా తయార వుతుంది. చర్మం కింద గడ్డలు, తలనొప్పితోపాటు ఇన్ఫెక్షన్‌ మెదడు, వెన్నుపూస దాకా చేరితే మూర్ఛ వ్యాధి రావొచ్చు. కలుషిత ఆహారం, కలుషిత నీరు, అశుభ్రమైన చేతులు, మనిషి మలం ద్వారా కూడా ఈ నులిపురుగులు వ్యాపి స్తాయి. ఉడికీఉడకని పంది మాంసం ద్వారా లార్వాలు మనిషి పేగుల్లోకి, అక్కడి నుంచి రక్తంలో కలుస్తాయి.

రక్తంతోపాటు శరీరమంతా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ లార్వాలు తిష్టవేస్తాయి. తొలి దశలోనే సిస్టీ సెర్కోసిస్‌ను గుర్తిస్తే నివారణ చాలా సులభం. ఆలస్యం చేస్తే మాత్రం మరణం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. అయితే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వ్యాధి ముదిరి ఏటా 50,000 మంది చనిపో తున్నారు. ‘యాంటీ–పారాసైట్‌ థెరపీ, స్టెరాయిడ్‌ లు, న్యూరోసిస్టీసెర్కోసిస్‌ కోసం యాంటీ–ఎపిలె ప్టిక్స్, సర్జరీ ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేసుకోవచ్చు. తొలి దశలో సీటీ స్కాన్‌ చేయిస్తే స్కానింగ్‌లో తెల్ల బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. దాంతో వీటిని గుర్తించవచ్చు. ఇన్ఫెక్షన్‌ సోకిన 5–12 వారాల్లోగా అవి నులిపురుగులుగా మారతాయి. అప్పుడు సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి’ అని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement