విస్సన్నపేట, కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో 86 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ పాఠశాలలో సుమారు 500 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి విద్యుత్తు లేకపోవటంతో వీరు చీకటిలోనే భోజనం చేశారు, కొద్దిసేపటికే ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటూ కడుపునొప్పితో బాధపడ్డారు.
ఆదివారం ఉదయానికి ఏకంగా 78 మంది కడుపు నొప్పితో బాధపడుతున్నా నిర్వాహకులు పట్టించుకోలేదు. ఆదివారం విద్యార్థులను కలుసుకునేందుకు తల్లిదండ్రులు రావడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఆందోళనతో నిర్వాహకులు 108 వాహనాలకు సమాచారం అందించి విద్యార్థులను మెరుగైన వైద్యంకోసం నూజివీడు తరలించారు. వంటగదిలో, భోజనం హాలులో కరెంటు పోతే చీకట్లో భోజనం పెట్టడం ఏంటని తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు.
86 మంది విద్యార్థులకు అస్వస్థత
Published Mon, Mar 31 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement